నేషనల్ క్రష్ రష్మిక మందన్న మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చేతినిండా సినిమాలతో సూపర్ బిజీ గా ఉన్న రష్మిక ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా తన హవా చూపిస్తుంది. పుష్ప చిత్రం విజయం తరువాత రష్మిక క్రేజ్ అమాంతం ప్రేరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ ఐపోయింది. దాంతో అనేక అవకాశాలు వచ్చి పడుతున్నాయి. రష్మిక ప్రస్తుతం తన కొత్త సినిమా “యానిమల్” ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రబీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రం, డిసెంబర్ 1 న విడుదల కాబోతోంది. ఈ చిత్రం ట్రైలర్ ను ఈ నెల 23 న విడుదల చేస్తాం అని ప్రకటించారు మేకర్స్.
యానిమల్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ కాంఫరెన్సులకు, టీవీ షోలకు అటెండ్ అవుతున్నారు ఈ చిత్ర యూనిట్. తాజాగా విడుదలయిన అన్ స్టాపబుల్ షో ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఐతే ఈ షో కు రష్మిక ఒక బ్లాక్ కలర్ సారీ కట్టుకొని వచ్చింది. ఈ సారీలో ఆమెను చూసిన అభిమానులు ఆమె అందానికి ఫిదా ఐపోయారు. ఐతే ఆ తరువాత అదే సారీతో ఒక ఫోటో షూట్ లో పాల్గొన్న రష్మిక, ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో బ్లాక్ ట్రాన్సపేరంట్ సారీతో, స్లీవ్ లెస్ బ్లౌజ్ తో ఎంతో ముద్దుగా ఉంది రష్మిక. తన మత్తెక్కించే కళ్ళతో, మతి పోగొట్టే ఫోజులతో ఇంటర్నెట్ ను ఊపేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
యానిమల్ చిత్రం అనంతరం రష్మిక “పుష్ప 2” , “రైన్ బో” చిత్రాలలో మెరవనుంది. ఈ చిత్రాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపిన విషయం మనందరికీ తెలిసినదే.
ఈ విషయమై స్పందిస్తూ రష్మిక ” సోషల్ మీడియాలో పర్సనల్ విషయాలను గురించి, వెళ్తున్న ప్రదేశాల గురించి షేర్ చెయ్యాలంటే భయపడాల్సి వస్తోంది” అన్నారు.