ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రధాన ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఎదిగారు దిల్ రాజు. మంచి సినిమాలు చేస్తూ, పరిశ్రమలో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు దిల్ రాజు. దిల్ రాజు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్ లుగా “ఫ్యామిలీ స్టార్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రోమోను కూడా విడుదల చేసారు మేకర్స్.
విజయ్, పరశురామ్ కాంబోలో వచ్చిన మొదటి చిత్రం గీత గోవిందం. ఈ చిత్రం ఎంతటి ఘణ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల అంచనాలు భారీ గానే ఉన్నాయ్. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు విజయ్ అభిమానులు. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెకండ్ హాఫ్ కథతో నిర్మాత దిల్ రాజు సంతృప్తిగా లేరని తెలుస్తుంది. అందుకే ఇప్పటికే కొన్ని సీన్లు షూటింగ్ పూర్తి ఐనప్పటికీ, కథలో కొన్ని మార్పులు చేసి మళ్ళీ రీషూట్ చేద్దాం అంటున్నారట నిర్మాత. కానీ అందుకు దర్శకుడు పరశురామ్ అంగీకరించడంలేదని తెలుస్తోంది. అందువలన వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతున్నాయట.
ఒక సినిమా విజయం సాధించాలంటే కథ విషయంలో దర్శకుడికి పూర్తి స్వతంత్రం ఉండాలి అన్న విషయం నిజమైనప్పటికీ, దిల్ రాజు ఎంతో అనుభవం ఉన్న నిర్మాత కాబట్టి అతను కథలో మార్పులు కోరుతున్నాడు అంటే అది కాస్త ఆలోచించదగ్గ విషయమే. మరి ఈ చిత్రం కథ విషయంలో ఎవరి మాట నెగ్గుతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, చాలా కాలంగా విజయ్ కు మంచి హిట్ లేదు. లైగర్ చిత్రం డిజాస్టర్ గా నిలిచాక, ఖుషి కాస్త పర్వాలేదనిపించినప్పటికీ, ఫామిలీ స్టార్ చిత్రం విజయం విజయ్ కు చాలా అవసరం. మరి ఇలా దర్శక నిర్మాతల మధ్య గొడవ కారణంగా సినిమా విఫలమైతే, నష్టపోయేది వారితో పాటు విజయ్ కూడా.