పెళ్లి విషయంలో సమంత సంచలన నిర్ణయం.. తల్లి కావాలన్న కోరిక అలా తీర్చుకుంటుందట..?!

సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకుంది సమంత. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. వయసు పెరుగుతున్న కొద్ది సినిమాల్లో క్రేజ్ ను కూడా మరింతగా పెంచుకుంటూ లైఫ్ లో దూసుకుపోతుంది. సినీ కెరీర్‌లో మంచి సక్సెస్‌ను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ పర్సనల్ జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకుల‌కు లోనఅయ్యింది. భ‌ర్త చైత‌న్య‌తో మ‌న‌స్ప‌ర్ధ‌ల కార‌ణంగా విడాకులు తీసుకోవడం.. నిందలు, ఆరోపణలు, ట్రోల్స్ ఇలా అన్నీ ఆమెను మానసికంగా కొంగదీశాయి.

వెంటనే మరో అనారోగ్య సమస్య ఆమెను చుట్టుముట్టింది. గత కొంతకాలంగా మయోసైటీస్ వ్యాధితో ఆమె బాధపడుతుంది.ఏడాదికాలంగా ఈ వ్యాధికి సమంత చికిత్స తీసుకుంటున్నా.. ఇప్పటికి అది పూర్తిగా క్యూర్ కాలేదు. ఇటీవల సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి విదేశాల‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ విశ్రాంతి తీసుకుంటుంది. ఇదిలా ఉండగా 36 ఏళ్ల వయసు దాటిపోతుండ‌టంతో సమంతకు మళ్ళీ పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఆమె తల్లిదండ్రులు ప్రెషర్ పెడుతున్నారట. స్నేహితులు కూడా వెంటనే వివాహం చేసుకోమంటూ సలహా ఇస్తున్నారని తెలుస్తుంది.

అయితే సమంత మాత్రం తన జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిందట. ఇకపై ఒంటరిగా ఉండిపోవాలి అనుకుంటున్న సమంత.. మిగిలిన జీవితం నటనకు, సోషల్ వర్క్ కోసం కేటాయించబోతుందని తెలుస్తుంది. తల్లి కావాలన్నా ఆమె కోరికను తీర్చుకోవ‌టానికి ఇద్దరు పిల్లలను భవిష్యత్తులో దత్తత తీసుకొని వారికి తల్లిగా ఉంటూ వారి బాగోగులు చూసుకోవాలని సమంత నిర్ణయం తీసుకుందట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక సమంత 2014 నుంచి ప్రత్యూష సపోర్ట్ పేరుతో ఓ చారిటీ ట్రస్ట్ ను రన్ చేస్తూ మహిళలు, ఆడపిల్లల సంక్షేమానికి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని అమ్మ అవుతారని తెలుస్తుంది. అయితే ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్న సమంత కొత్త ప్రాజెక్టులు వేటిని అనౌన్స్ చేయలేదు. ఇక చివరిగా సెటాడెల్ వెబ్ సిరీస్‌లో నటించింది ముద్దుగుమ్మ. పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సిరీస్ వచ్చేయడది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.