రివ్యూ: ఆది కేశవ మూవీ రివ్యూ.. దండం పెట్టేస్తున్న నేటిజన్స్..!!

మెగా హీరో వైష్ణవి తేజ్ మొదట ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా ఘోరమైన డిజాస్టర్లుగా మిగిలాయి. ఇప్పుడు తాజాగా ఈరోజున ఆది కేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చూసిన పలువురు నేటిజెన్స్ ట్విట్టర్ల రూపంలో ఆడేసుకుంటున్నారు.

ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఈ సినిమా చూసిన చాలామంది నైటీజెన్సీ ఇలాంటి సినిమా ఎందుకు తీశారు రాడ్ సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆ నరుకుడు ఏంటో ఆ తీయడం ఏంటో అంటూ చాలా ఫైర్ అవుతున్నారు జనాలు. మొత్తానికి ఆదికేశవ సినిమా ప్రేక్షకులకు ఒక తలనొప్పిగా మారిందని తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా విడుదల ట్రైలర్ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇందులో చాలా ఓవర్ సీన్స్ కూడా కనిపించాయి. డైరెక్టర్ శ్రీకాంత్ ఈ సినిమాని సరిగ్గా హేండిల్ చేయలేకపోయారు.

శ్రీ లీల మాత్రం తన పాత్రకు న్యాయం చేసిందని తన నటనని, డాన్స్ కోసమే చూడాలన్నది తెలియజేస్తున్నారు. ఏం తీయాలో తెలియక తీశారని తెలియజేస్తున్నారు తీసిన సినిమా ఆ డైరెక్టర్ కైనా అర్థం అవుతుందో లేదో అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా యూఎస్ఏ లో షోలన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయని.. టికెట్లు బుకింగ్స్ కాక క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తోంది. శ్రీ లీల గ్లామర్ పరంగా పాజిటివ్ బజ్ తెచ్చిన ఈ సినిమా నిలబెట్టేలా కనిపించడం లేదట.