వరల్డ్ కప్ కామెంటరీ బాక్స్‌లో టాలీవుడ్ స్టార్ హీరో ప్రత్యక్షం..

అప్‌కమింగ్ ఫిల్మ్ ‘హాయ్ నాన్న’ ప్రమోషన్‌లో భాగంగా, నేచురల్ స్టార్ నాని ముంబైకు చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్‌కు తెలుగు కామెంటరీ టీమ్‌తో తాజాగా జాయిన్ కూడా అయ్యాడు. హాట్‌స్టార్ వేదికగా నాని కామెంట్రీ చెప్తూ ఆకట్టుకుంటున్నాడు. మంచి కామెంటేటర్ అని అతనిపై అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రపంచ కప్ ఫైనల్ క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద ఆకర్షణగా అతని వ్యాఖ్యలు మారాయి. ఫ్యాన్స్ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌తో పాటు నాని చమత్కారమైన, తెలివైన కామెంటరీ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా, క్రికెట్ రెంటిపైనా మక్కువ ఉన్న నాని ఈ అవకాశం ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువవ్వాలని భావిస్తున్నాడు. అతను మునుపటి మ్యాచ్‌లకు కామెంటరీలో పాల్గొన్న వరుణ్ తేజ్, రవితేజల అడుగుజాడలను ఫాలో అవుతూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. జానకి నాని ఒకప్పుడు రేడియో జాకీ అవే స్కిల్స్ ఇప్పుడు వాడుతున్నాడు.

కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘హాయ్ నాన్నా’ హార్ట్ టచింగ్ స్టోరీతో ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుందని చాలామంది అంచనా వేస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో భాగమైన నిర్మాతలు మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి K.S. ఈ చిత్రానికి మద్దతునిస్తున్నారు. దీనిని డిసెంబ‌ర్ 7న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

నాని ఈ సినిమాతో హిట్టు కొడితే అతని కెరీర్ గ్రాఫ్ చాలా పెరుగుతుంది. మృణాల్ ఠాగూర్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఇట్స్ కొట్టిన సక్సెస్ ఫుల్‌ హీరోయిన్ గా అవతరిస్తుంది. ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు కూడా పెరుగుతాయి.