సలార్ సినిమా ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ వైఫ్..!!

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియ వైజ్ గా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడడం జరిగింది. సలార్ మొదటి భాగాన్ని డిసెంబర్ 22న విడుదల చేయాలంటూ మేకర్ ఇది వరకే ప్రకటించారు. సలార్ సినిమా విడుదల సమయం దగ్గర వేగవంతం చేశారు చిత్ర బృందం.

గత కొద్దిరోజులుగా సలార్ సినిమా ట్రైలర్ విషయంలో చిత్ర బృందం అప్డేట్ సైతం తెలియజేస్తూనే ఉంది. సలార్ మొదటి భాగం ట్రైలర్ డిసెంబర్ ఒకటవ తేదీన రాత్రి 7:19 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు సైతం సలాం సినిమా ట్రైలర్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య అదిరిపోయే అప్డేట్ను సైతం తెలియజేయడం జరిగింది.

తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ రికార్డింగ్ స్టూడియో నుంచి ఒక ఫోటోని సైతం తీసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. సలార్ ట్రైలర్ కట్ వర్క్ జరుగుతోందని పోస్ట్ షేర్ చేయడం జరిగింది. అలాగే మరొకసారి ట్రైలర్ డిసెంబరు ఒకటిన విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రశాంత్ నీల్ దగ్గరుండి ఈ సినిమా ట్రైలర్ ని కట్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఈ ట్రైలర్ అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.