అందులో నా భర్త వీక్..షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్..!!

సౌత్ లోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్.. వివాహమైనప్పటికీ కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అభిమానులను ఫుల్ జోష్లో నింపేలా చేస్తోంది. అంతేకాకుండా ఒక బిడ్డకు తల్లి అయినా కూడా తన అందంతో మరింత అందంగా కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.. అలాగే పలు లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ గతంలో స్టార్ హీరోల సరసన కూడా నటించి రొమాన్స్ చేసింది.

తాజాగా సత్యభామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఒక పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ కి అభిమానులు నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుండడంతో ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా పాల్గొంటుంది కాజల్ అగర్వాల్ ఇందులో భాగంగానే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

యాంకర్ ఒక ప్రశ్న అడగక పెళ్లి జరిగి ఇన్ని రోజులు అయినా కూడా మీ ఇద్దరిలో ఎవరు రొమాంటిక్ అని అడగగా అందుకు కాజల్ అగర్వాల్ సమాధానం చెబుతూ నేనే రొమాంటిక్ తన భర్త రొమాన్స్ లో చాలా వీక్ అంటూ తెలియజేసింది. భర్త గురించి ఇలా పబ్లిక్ గా చెప్పడంతో ఒక్కసారిగా అభిమానుల సైతం షాక్ గురయ్యారు.. కాజల్ అగర్వాల్ వివాహమైన తర్వాత కూడా చాలా బోల్డ్ గానే మాట్లాడుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది. మరి ఈ విషయంపై కాజల్ అభిమానులు ఏమంటారు చూడాలి మరి.