తమన్ బర్త్ డే స్పెషల్: ఆయన వయసు ఎంతో తెలుసా… అస్సలకి నమ్మలేరు…!!

మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు వింటేనే ముందుగా గుర్తుకొచ్చేది తమన్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి సంగీతం అందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఈయన 2020లో ఏకంగా 10 సినిమాలకు సంగీతాన్ని సమకూర్చి మంచి గుర్తింపు పొందాడు. అందులో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన..” అలా వైకుంఠపురం లో ” లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ సినిమాతో పాటు డిస్కో రాజా, సోలో బతుకే సో బెటర్, రేసుగుర్రం, బిజినెస్ మాన్, తొలిప్రేమ, సర్కారు వారు పాట, జవాన్ లాంటి సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. అలాగే 2021లో కూడా 1,2 కాదు.. దాదాపు 15 సినిమాలకి పైగా మ్యూజిక్ అందించాడు.

అలాగేల‌ ఈ ఏడాదిలో 2023 భగవంత్ కేసరి, వీర సింహారెడ్డి, స్కంద, బ్రో వంటి అగ్ర హీరోల సినిమాలకు సైతం సంగీతం అందించి మరింత పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఇక నేడు తమన్ పుట్టినరోజు. ఈయనకి నేటితో 38 ఏళ్లు పూర్తయ్యాయి. 39 ఏళ్లకి అడుగుపెట్టాడు. ఈయన పుట్టినరోజు సందర్భంగా పలు సెలబ్రిటీలు తమన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తమన్ పుట్టినరోజు సందర్భంగా ఈయన ఫోటోలు, పాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆయన అభిమానులు.