స్టేజ్ పై మరో టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న సుమ… మామూలుగా లేదుగా…!!

యాంకర్ సుమ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అగ్ర హీరోల సినిమాల రిలీజ్ లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ.. తెలుగులో చక చక మాట్లాడుతూ.. టైమింగ్ పంచులతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది సుమ.

ఈమె మలయాళీకి చెందిన అమ్మాయి అయినా.. తెలుగులో పలు సీరియల్స్, సినిమాలో నటించి యాంకర్ గా స్టార్ మహిళ అనిపించుకుంది. ప్రస్తుతం ఫుల్ టైం యాంకర్ గానే కొనసాగుతుంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా ఒక వెలుగు వెలుగుతుంది. ప్రస్తుతం సుమ ” స్పార్క్ ది లైఫ్ ” అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరించింది.

అక్కడ కేవలం యాంకర్ గానే కాకుండా.. స్టేజ్ మీద డాన్సర్స్ తో పాటు క్లాసికల్ డాన్స్ కూడా వేసి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన ప్రేక్షకులు.. ” సుమ యాంకర్ మాత్రమే కాదు మల్టీ టాలెంటెడ్ ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.