ఎన్టీఆర్ అన్న మాటలకు సోఫాలో నుంచి లేచి వెళ్లిపోయిన స్టార్ డైరెక్టర్.. పౌరుషం ఎక్కువే..!

జూనియర్ NTR కోపం ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే . ఆ మాటకొస్తే నందమూరి హీరోల అందరికీ కూసింత కోపం ఎక్కువే . మిగతా హీరోలతో కంపేర్ చేస్తే ఈ స్టార్ హీరోలు స్పాంటేనియస్ గా ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు. కాగా రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అది కూడా ప్రశాంత్ నీల్ కి సంబంధించిన ఇష్యూ కావడంతో జనాలు మరింత ట్రెండ్ చేస్తున్నారు జనాలు.

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుంది. అయితే రీసెంట్ గా ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలోనే సరదాగా ముచ్చటిస్తూ లక్ష్మీ ప్రణతిని కూడా ఎన్టీఆర్ 31 సినిమాలో నటించమంటూ కోరారు . అయితే మొదటినుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ లేని లక్ష్మీ ప్రణతి నో చెప్పింది. ప్రశాంత్ నీల్ అంతటితో వదలలేదు . జస్ట్ టూ మినిట్స్ ఒక షాట్ అంతే నువ్వు సైలెంట్గా ఎన్టీఆర్ పక్కన ఉంటావు. అలాంటి సీన్ నీకు ఇస్తాం.. ఒక్కసారి ట్రై చెయ్ నందమూరి ఫ్యాన్స్ కోరిక కూడా తీర్చినట్లు ఉంటుంది అంటూ ఫోర్స్ చేశారట .

అయితే లక్ష్మీ ప్రణతి ఏమాత్రం ఆయనకు చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు . అంతే సడన్ గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి అవన్నీ జరిగే పనులు కావులే అంటూ కూసింత కోపంగా ఆన్సర్ చేశారట. దీంతో హర్ట్ అయిన ప్రశాంత్ నీల్ సోఫాలో నుంచి లేచి బయటకు వెళ్లిపోయాడు అన్న వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు నందమూరి ఫ్యాన్స్ కూడా లక్ష్మి ప్రణతిని తెరపై చూడడానికి ఇంట్రెస్ట్ గా లేరు. ఆమెను హౌస్ వైఫ్ గా చూడడానికి ఇష్టపడుతున్నారు . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సైతం నందమూరి అభిమానుల కోరిక ప్రకారమే ఆన్సర్ ఇచ్చాడు అన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు..!!