గోవా బ్యూటీ ఇలియానాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టడంతో ఈ బ్యూటీ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, నితిన్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోస్ తో కూడా నటించి మెప్పించింది. ఒకప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మ తర్వాత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అక్కడ సరిగ్గా సక్సెస్ రాకపోవడం.. తర్వాత సౌత్ లో కూడా ఊహించిన రేంజ్ లో అవకాశాలు అందకపోవడంతో ఇండస్ట్రీకి మెల్లగా దూరమైంది.
ఇక లవ్ ఎఫైర్, బ్రేక్ అప్ లాంటి వ్యవహారాలతో డిప్రెషన్ లోకి వెళ్లిన ఇలియానా ఒకానొక టైంలో బాడీ అవుట్ ఆఫ్ షేప్‌గా కూడా మారింది. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో పడి.. బ్రేకప్ చేసుకుంది. ఇక ఇటీవల ఇలియానా భర్త పేరు చెప్పకుండానే తల్లి అవుతున్నట్లు అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఇక తాజాగా ఇలియానాకు ఓ మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. భర్త ఎవరు.. అసలు పెళ్లి చేసుకుందా.. అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటన్నిటికీ సమాధానం చెప్తు తన భర్త మిచెల్ డోలన్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది.
ఈ నాజుకు నడుము సుందరి గర్భవతి అని ప్రకటించడానికి కొన్ని నెలల ముందే.. మిచెల్‌ని వివాహం చేసుకుందట. అయితే ఇలియానా, మిచెల్ వివాహం ఎక్కడ జరిగింది.. ఎలా జరిగింది.. అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం రాలేదు. అయితే ఇటీవల తాజాగా ఇలియానా మరో సంచలనం నిర్ణయం తీసుకుందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన భర్త, కొడుకుతో కలిసి విదేశాలకు చెక్కేయాలని ఆమె ప్లాన్ చేస్తుందట. యుఎస్ లో సెటిల్ కావాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు రాకపోవటం, ఆమెకు కూడా నటనపై ఆసక్తి లేకపోడంతో.. ఇలియానా తన భర్తతో కలిసి యూఎస్లో సెటిలై.. కొత్త లైఫ్ ని ప్రారంభించాలని భావిస్తుందట.
ఆమె అమెరికాకు వెళ్లడానికి గల కారణాలు ఏంటో తెలియదు కానీ ఇండియాని వెళ్లడం మాత్రం కచ్చితంగా అంటూ చెబుతున్నారు. అయితే ఇటీవల కాస్త షేప్ అవుట్ అయిన ఇలియానా గ్లామర్, ఫిట్నెస్ పై కాస్త ఫోకస్ చేస్తే మళ్లీ ఆమెకు సినిమా అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ప్రస్తుతం సినిమాలపై ఇల్లు బేబికి ఎటువంటి ఆసక్తి లేదట దీంతో ఇప్పటికే చాలామంది ఫారిన్ వెళ్లి సెట్ అయిన తారల బాటలోనే ఇలియానా కూడా ప్రయాణిస్తుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది.