పాయల్ రాజ్ పుత్ లవ్ బ్రేకప్ గురించి ఈ విషయాలు తెలుసా..?

డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన Rx -100 సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తన మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇందులో నెగటివ్ పాత్రలో నటించి తన గ్లామర్ తో మరింత పాపులారిటీ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్నో చిత్రాలలో సరైన అవకాశాలు వచ్చిన తనని తాను నిరూపించుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలిగే ఈ ముద్దుగుమ్మ గ్లామర్ తో గోల్డ్ సన్నివేశాలతో రెచ్చిపోతూ నటిస్తూ ఉంటుంది.


తాజాగా ఇప్పుడు మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో నందిత శ్వేత ,అజయ్ ఘోష్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈనెల 17వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన ప్రేమ ఫెయిల్యూర్ గురించి పలు విషయాలను తెలిపింది. తన ఫస్ట్ లవ్ గురించి స్పందిస్తూ చదువుకునే రోజులలో సినిమాలలో.. సినిమాలలో మీ కృషి ఎవరైనా ఉన్నారా అని అడగగా..

అందుకు పాయల్ మాట్లాడుతూ స్కూల్ డేస్ లో ఒక అబ్బాయిని ప్రేమించాను అతని చూడగానే ఏదో తెలియని ఆనందం కలిగింది.తన ప్రేమను తెలియజేయగా అతని రిజెక్ట్ చేశాడని ఆ బాధతో ఎక్కువగా చదువు పైన దృష్టి పెట్టలేకపోయానని దీంతో పరీక్షలలో ఫెయిల్ అయ్యానని ఈ విషయం తన తల్లికి చెప్పి ఏడ్చాను అంటూ తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. మంగళవారం సినిమా షూటింగ్ సమయంలో తన కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడ్డానని జీవితంలో కష్టంగా గడిచిన క్షణాలు ఇవే అంటూ తెలియజేసింది. ఆ సమయంలో లిక్విడ్ ఫుడ్ తీసుకునే దాన్ని అంటూ తెలిపింది.