” మా పెళ్లి వీడియోను మేము ఎవరికీ అమ్ముకోలేదు… ఆ పుకార్లు మొత్తం పచ్చి అబద్ధాలు “… వరుణ్ టీమ్ సోషల్ క్లారిటీ…!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న 3 ముళ్ళు బంధంతో ఒకటైన సంగతి మనకి తెలిసిందే. కొద్దికాలంగా గుట్టుచప్పుడు కాకుండా వీరిద్దరూ ప్రేమాయణం నడిపి.. అనంతరం పెద్దలు ఒప్పందంతో వివాహం చేసుకున్నారు. ఇటలీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వివాహానికి మెగా కుటుంబం, అల్లు ఫ్యామిలీ, వీరి స్నేహితులు హాజరయ్యారు. ఇకపోతే వీరి పెళ్లికి సంబంధించిన వీడియో స్ట్రీమింగ్ హక్కులను ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు ఇచ్చారంటూ కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై తాజాగా వరుణ్ టీమ్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది.

” వరుణ్, లావణ్య వివాహం ఓటీటీ హక్కుల గురించి వస్తున్న పుకార్లు అన్ని అబద్ధం. ఇలాంటి రూమర్స్ నమ్మి, ప్రచారం చేయవద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ” అంటూ వరుణ్ టీం ట్వీట్ చేశారు. తద్వారా వీరి పెళ్లి ఓటీటీ రైట్స్ రూ.10 కోట్లకు నెట్ఫ్లిక్స్ పొందడం అనేది పచ్చి అబద్ధం అని వెల్లడయింది. ప్రస్తుతం వీరి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.