Bigg Boss: శివాజీ పై పంచ్ వేసిన గౌతమ్ తల్లి.. ఎక్కడో హర్ట్ అయినట్టున్నాడే..?!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం అత్యధిక ఓటింగ్ తో టైటిల్ విన్నర్ అవకాశాలను ఎక్కువగా శివాజీ అందుకున్నాడు. అయితే శివాజీ కూడా ఎప్పటికప్పుడు తన పొరపాట్లతో హౌస్ మెట్లకు దొరికిపోతూ ఉంటాడు. టాస్కులు లేని సందర్భంలో ఇంట్లో పని ఒక్కటంటే ఒకటి కూడా చేయకుండా రిలాక్స్ అవుతుంటాడు. తన బ్యాచ్ తో కారిడార్ లో కూర్చుని ఇతర కంటిస్టేంట్ల పై విమర్శలు కురిపిస్తూ ఉంటాడు. అయితే ఏ పని చేయకపోయినా, టాస్కులు సరిగ్గా ఆడకపోయినా మాటకారి తత్వంతో నాగార్జునని కూడా ఇరుకున పెట్టేస్తున్నాడు.

దీంతో బిగ్ బాస్ హౌస్‌లో శివాజీకి ఎదురు చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. అమర్, గౌతమ్‌ మాత్రమే శివాజీ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. కాగా నిన్న శివాజీ కొడుకు, అశ్విని తల్లి, మరియు అర్జున్ సతిమని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళ రాక వీళ్ళ మధ్య జరిగిన ఎమోషనల్ కాన్వర్జేషన్ అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఇక ఈరోజు గౌతమ్ తల్లి, ప్రియాంక కాబోయే భర్త శివ కుమార్, బోలే షావలి భార్య హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. వారిలో గౌతమ్ తన అమ్మతో జరిగిన సంభాషణ ప్రోమో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

ఆమె హౌస్ లో అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరితోనూ ఎంతో ప్రేమగా వ్యవహరించింది. ముఖ్యంగా యావ‌ర్ ఈమెను చూడగానే తన తల్లి గుర్తుకొచ్చిందంటూ కంట‌త‌డి పెట్టుకున్నాడు. దానికి గౌతమ్ అమ్మ.. స్పందిస్తూ ఏడవకు నేను కూడా మీ అమ్మని అనుకో.. మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండు అంటూ చెప్పుకొచ్చింది. అయితే అందరితో ప్రేమగా మాట్లాడిన ఆమె శివాజీ మీద మాత్రం సెటైర్లు వేసింది. గౌతమ్ కెప్టెన్ అయింది నా వల్లే అంటూ శివాజీ డప్పు కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు.

అప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాట్లాడుతూ అందరూ తీసుకున్న నిర్ణయం వల్ల గౌతమ్ కెప్టెన్ అయ్యాడు అంటూ చెప్పుకోచ్చారు. గౌతమ్ తల్లి మరి శివన్న ఏంటి తన వల్లే కెప్టెన్ అయ్యాడు అంటాడు అందరి వల్ల కదా అయింది అంటూ ఆన్సర్ చేసింది. దీంతో శివన్న ఎక్కడో హర్ట్ అయినట్టున్నాడు.. నోట నుంచి మాట రాలేదు. ఇక గౌతమ్ తల్లి హౌస్ నుంచి వెళ్ళిపోయే సమయంలో గౌతమ్ ని నీకు ఇంకా టైం ఉంది రోయ్.. అమ్మని పంపించు.. నువ్వు వెళ్లిపోకు అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం శివాజీ వేసిన ఈ డైలాగ్ తో సోషల్ మీడియాలో శివాజీ పై నెగిటివిటీ ఏర్పడింది.