సినీ రంగంలో నటిగా చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ… మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన హీరోయిన్ మాధవి లత. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ… నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. ఎల్లప్పుడూ కౌంటర్స్ పోస్టులు, కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.
ఇక తాజాగా నందమూరి నట సింహం బాలయ్య నటించిన ” భగవంత్ కేసరి ” సినిమా గురించి కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ… బాలయ్య పై సెటైర్లు సైతం వేసింది. ” భగవంత్ కేసరి సినిమాలో హీరో బాలయ్య చేత గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఎంతో అద్భుతంగా చెప్పించారు. ఒక గొప్ప పేరు ఉన్న హీరో ఇలా చెప్పడం చాలా మంచి విషయం. ఈ సీన్ పిల్లలకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
కానీ ఈ డైలాగ్స్ చెప్పడమే కాదు వాటిని పాటిస్తే కూడా బాగుంటుంది ” అంటూ సెటైరికల్ కామెంట్స్ చేసింది. ఈ వార్తపై స్పందిస్తున్న బాలయ్య అభిమానులు…” అసలు ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేసింది? చెప్పేదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా? అంత ధైర్యం లేదా నీకు? మా బాలయ్యని అనే అంత గొప్ప దానివైతే నువ్వు కాదు. నీ బతుకు ఆయన కాలు గోటికి కూడా సరిపోదు ” అంటూ ఫైర్ అవుతున్నారు .