క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమని..!!

కోలీవుడ్ టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి అగ్ర హీరోయిన్గా పేరు పొందింది సీనియర్ హీరోయిన్ ఆమని. ప్రస్తుతం తన కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్స్ సైతం ప్రారంభించి వరుసగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది.. ఇలా హీరోయిన్గా ఒకానొక సమయంలో స్టార్ హీరోల అందరి సినిమాలో నటించిన ఆమని తాజాగా ఇండస్ట్రీలో ఉండేటువంటి క్యాస్టింగ్ కౌచ్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

చాలామంది సెలబ్రిటీల సైతం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తెలియజేస్తూ ఉంటారు.. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది. సినిమా అవకాశాల కోసం తాను ఫోటోలను పంపగా వారు ఆడిషన్కీ అని చెప్పి అక్కడ అమ్మాయిలు రంగు తక్కువగా ఉందంటూ చాలా మందితోపాటు తను కూడా హేళన చేశారని మరికొన్నిసార్లు ఫోన్ చేసి చెప్తామని మొబైల్ నెంబర్లు తీసుకొని విసిగించేవారని తెలుపుతోంది ఆమని.

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా వెళ్లిన తర్వాత కొంతమంది దర్శక నిర్మాతలు సినిమా అవకాశాలు ఇచ్చి చాలా బోల్డ్ సన్నివేశాలలో నటించమని చెప్పేవారట.. అలాంటి సన్నివేశాలలో నటించేటప్పుడు మీ శరీరం పైన ఎక్కడ మార్క్స్ ఉండకూడదని ఏమైనా ఉన్నాయా అని చూడనివ్వండి అంటూ చాలా ఘోరంగా మాట్లాడే వారిని ఆమని తెలిపింది. తనతో కూడా ఈ విషయంలో చాలామంది ఇలాగే ప్రవర్తించారని అయితే ఈ విషయాలు తెలుసుకొని తాను వారి నుంచి తప్పించుకున్నారని తెలిపింది. అలా సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి క్యాస్టింగ్ కౌచ్ పైన ఆమని తెలియజేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.