పాయల్ కు ఆ విధంగా సహాయం చేస్తున్న అల్లు అర్జున్..!!

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బోల్డ్ బ్యూటీగా గ్లామర్ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఈ ముద్దుగుమ్మ మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈనెల 17వ తేదీన విడుదల కాబోతోంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్ సైతం వేగవంతం చేస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నవంబర్ 11న చేయబోతున్నారు.

ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని దీనిపైన అఫీషియల్ గా చిత్ర బృందం కన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు పొందిన పాయల్ నటనకు ఫిదా అయి అల్లు అర్జున్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా సినిమాలు ఏవైనా సరే అల్లు అర్జున్ ప్రోత్సహిస్తూ ఉంటారు. అల్లు అరవింద్ కూడా తన బ్యానర్ పైన చిన్న హీరోల సినిమాలను నిర్మిస్తూ చాలామంది ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. మరి అల్లు అర్జున్ ఈ విధంగా పాయల్ సినిమాకి సహాయం చేయడంతో ఏ మేరకు ఈ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.అల్లు అర్జున్ ఇటీవల జాతీయ అవార్డుని పుష్ప చిత్రానికి గాను అందుకోవడం జరిగింది. దీంతో అప్పటినుంచి అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగిపోయింది.