ఇండస్ట్రీ లోకి రాకముందు కృతి శెట్టి ఏం చేసేదో తెలుసా.. మరీ అంత తక్కువ శాలరీకి పని చేసిందా..?

ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది కృతి శెట్టి. మెగా హీరో వైష్ణవ తేజ్ స‌రసన నటించిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ సక్సెస్ త‌న ఖాతాలో వేసుకుంటుంది అని ఫాన్స్ భావించారు. అయితే కృతి శెట్టి తర్వాత నటించిన సినిమాలేవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఇలా ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాక‌పోయిన‌ తెలుగు, తమిళ భాషల్లో ప‌లు అవకాశాలు వచ్చాయి. ఇక అన్ని వరుసగా డిజాస్టర్లు అవ్వడంతో ప్రస్తుతం ఆమెకి అవకాశాలు తగ్గాయి.

చివరిగా నాగచైతన్య హీరోగా నటించిన క‌స్ట‌డి సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం శర్వానంద్ జంటగా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇలా కెరీర్ పరంగా పలు సినిమాల్లో బిజీగా గడుపుతున్న కృతి శెట్టి ఒకవేళ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకపోయి ఉంటే ఏం అయ్యేవారు.. అనే డౌట్ అందరికీ ఉంటుంది. ఇక తాజాగా కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యువర్ అడిగిన ప్రశ్నలకు ఎన్నో ఆసక్తికరమైన సమాధానం చెప్పుకొచ్చింది కృతి శెట్టి.

ఇందులో భాగంగా మీ మొదటి జాబ్ ఏంటి..? సాలరీ ఎంత..? అని యాంకర్ ప్రశ్నించగా తన ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటే సినిమాకి తీసుకున్నది కాదు అంటూ చెప్పుకొచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చెప్పే గ్రోసరీ ఐటమ్స్ అన్ని షాప్ కి వెళ్లి తీసుకువచ్చి వ‌చ్చేదాన్ని. అదే నా ఫస్ట్ జాబ్ అంటూ కృతి శెట్టి చెప్పుకొచ్చింది. దానికి అమ్మ నాకు రూ.100 లేద రూ.150 ఇచ్చే వారిని.. అదేనా ఫస్ట్ శాలరీ అంటూ కృతి శెట్టి వివరించింది. ఇక ప్రస్తుతం కృతి శెట్టి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవడంతో సో స్వీట్ కృతి అమ్మకు హెల్ప్ చేసేదానివా అంటూ.. మరీ అంత తక్కువ శాలరీకి పనిచేసే దానివా కృతి సో సాడ్ అంటూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజ‌న్స్.