కాబోయే భార్య‌కు ఏ భ‌ర్త ఇవ్వ‌ని కానుక ఇవ్వ‌బోతున్న వ‌రుణ్ తేజ్‌.. మెగా ప్రిన్స్ టూ రొమాంటిక్‌!?

టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ల‌ నుంచి సీక్రెట్ గా ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. రేపు మాపో పెళ్లి కూడా జరగబోతోంది.

ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు అయ్యాయి. అయితే తాజాగా వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది. పెళ్లి సందర్భంగా కాబోయే భార్య లావణ్య త్రిపాటికి ఏ భ‌ర్త‌ ఇవ్వని కానుకను వరుణ్ తేజ్ ఇవ్వబోతున్నాడట. ఈ మధ్య సెలబ్రెటీలు పెళ్లయిన రెండు మూడు రోజులకే మళ్ళీ షూటింగ్స్ లో బిజీ అవుతున్నారు. కానీ వరుణ్ తేజ్ మాత్రం పెళ్లి తర్వాత దాదాపు నెల రోజులు తన స‌మ‌యం మొత్తాన్ని భార్యకే కేటాయించబోతున్నాడట.

షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ వెకేషన్స్ కు వెళ్తూ లావణ్య ను ఫుల్ హ్యాపీగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడట‌. ప్ర‌స్తుతం ఈ న్యూస్ నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతుండ‌టంతో.. మెగా ప్రిన్స్ టూ రొమాంటిక్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల గాండీవదారి అర్జున సినిమాతో ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రిచిన వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వంలో `మ‌ట్కా` అనే మూవీ చేస్తున్నాడు. అలాగే మ‌రోవైపు వార్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న `ఆపరేషన్‌ వాలెంటైన్‌`లో వ‌రుణ్ హీరోగా న‌టిస్తున్నాడు.