కేరళలో రజనీకాంత్ న్యూ మూవీ… షూటింగ్ స్పాట్ లో ఫ్యాన్స్ హంగామా..!!

rajinikanth

తాజాగా ” జైలర్ ” మూవీతో ఊహించని స్థాయిలో విజయం అందుకున్న రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకంగా రూ. 700 కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఐదు పదుల వయసు దాటుతున్న సరే.. ఏజ్ జస్ట్ ఎ నెంబర్ అంటూ సినిమా రంగంలో దూసుకుపోతున్నాడు రజిని.

ఇక ఈయన తాజాగా నటించిన జైలర్ సినిమా హిట్ కావడంతో.. రజిని తదుపరి సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్.. లోకేష్ కనగరాజన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన షూటింగ్ కేరళలో మొదలైంది. సూపర్ స్టార్ సినిమా కావడంతో షూటింగ్ స్పాట్ కు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.

రజినీ ఎంటర్ కావడంతో తలైవా అంటూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రజనీకాంత్ మరింత యంగ్ లుక్ లో కనిపించాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.