స‌మంత‌, మృణాల్ మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్‌ను గ‌మ‌నించారా.. ఇద్ద‌రూ సేమ్ టూ సేమ్‌!

టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ లో సమంత, మృణాల్ ఠాగూర్ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. సమంత దశాబ్దన్నర నుంచి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ సినిమాలు చేస్తోంది. అలాగే మృణాల్ ఈమధ్యే వచ్చినా కెరీర్ ను అద్భుతంగా పరుగులు పెట్టిస్తోంది. అయితే సమంత, మృణాల్ ఒక విషయంలో సేమ్ టు సేమ్ గా ఉన్నారు.

ఇంత‌కీ వీరిద్దరి మధ్య ఉన్న ఆ కామన్ పాయింట్ ఏమిటంటే.. సమంత, మృణాల్ ఇద్దరూ క‌ల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీల‌తోనే హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. అలాగే తొలి సినిమాతోనే ఇద్దరూ ఓవర్ నైట్ స్టార్స్‌ గా గుర్తింపు తెచ్చుకున్నారు. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అలాగే తెలుగులో ఫ‌స్ట్ మూవీతో వ‌చ్చిన భారీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా స‌మంత‌ చాలా జాగ్ర‌త్త‌గా కెరీర్ ను ముందుకు న‌డిపించింది.

ఇప్పుడు మృణాల్ కూడా అదే బాట‌లో వెళ్తోంది. వ‌చ్చిన ప్ర‌తి సినిమాకు సైన్ చేయ‌కుండా.. సెల‌క్టివ్ గా క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం మృణాల్ తెలుగులో న్యాచుర‌ల్ స్టార్ నానితో `హాయ్ నాన్న‌`, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ మూవీ చేస్తోంది. ఇక మ‌రోవైపు స‌మంత అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సినిమాల‌కు చిన్న బ్రేక్ ఇచ్చింది. ప్ర‌స్తుతం వెకేష‌న్స్ లో ఫుల్ గా చిల్ అవుతూ.. మాన‌సికంగా, శారీర‌కంగా ఫిట్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.