మీకు తెలియకుండా మీ పేరు పైన ఉన్న సిమ్ కార్డులను ఇలా బ్లాక్ చేయండి..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ మొబైల్ అనేది కచ్చితంగా ఉండనే ఉంటోంది. ఫోన్ కాల్స్ కోసం జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ ఇతర సిమ్ కార్డులను సైతం ఎవరికి నచ్చినట్లుగా వారు ఉపయోగించుకుంటూ ఉన్నారు. అయితే మనకు తెలియకుండానే చాలా సిమ్ కార్డులను తీసుకుంటూ ఉంటాము.. ఉచితంగా బ్యాలెన్స్ వ్యాలిడిటీ ఇచ్చిన సమయంలో సిమ్ కార్డులను తీసుకోగానే వ్యాలిడిటీ బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే పక్కకు పారేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకో సిమ్ కార్డు తీసుకోవడం వంటిది చేస్తూ ఉన్నారు.

ఇలా సిమ్ కార్డులను ఉపయోగించడం వంటివి జరుగుతూనే ఉండేది..కానీ ఈ మధ్యకాలంలో కేవలం ఒక వ్యక్తికి ఆధార్ కార్డు మీద 9 సిమ్ కార్డ్స్ మాత్రమే ఉండాలని రూల్స్ ని ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది. మరి కొంతమంది అయితే ఏకంగా వారి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయని విషయం వారికి తెలియకపోవచ్చు .దీంతో ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుంది. ఒకవేళ ఎవరి పేరు మీద అయినా తెలియకుండానే సిమ్ కార్డులు ఉన్నట్లు అయితే వాటిని బ్లాక్ చేసుకోవచ్చు..

ఆధార్ తో లింక్ అయిన సిమ్ కార్డులను మాత్రమే ఉపయోగించాలని టెలికాంశాఖ ఇటీవలే కొన్ని రూల్స్ తీసుకురావడం జరిగింది.ఆన్లైన్ టూల్ పోస్టర్ యూజర్లు ఆధార్ నెంబర్తో లింక్ అయినా మొబైల్ నెంబర్ అన్నిటిని తెలుసుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ ద్వారా మన పేరు మీద ఎన్నిసార్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు.

https://tafcop.dgtelecom.gov.in/ అనే వెబ్సైట్లోకి వెళ్లి మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది మీ పేరు పైన ఉన్న మొబైల్ నెంబర్స్ అక్కడ డిస్ప్లే అవుతాయి అందులో ఉపయోగపడని నెంబర్ ఉంటే అక్కడే బ్లాక్ చేసుకుని సదుపాయం కూడా కలదు.