విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ల‌వ్ క‌న్ఫార్మ్ చేసేసిన ర‌ష్మిక‌.. వైర‌ల్ గా మారిన లేటెస్ట్ పోస్ట్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష రష్మిక మందన్నా లవ్ లో ఉన్నారని ఎప్పటినుంచో జోరుగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ గీతా గోవిందం సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు.. విజయ్ దేవరకొండ, రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించారు.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. రష్మిక విజయ్ జోడి కి మాత్రం ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే ఈ రెండు సినిమాలు తర్వాత విజయ్-రష్మిక తరచూ కలుసుకోవడం, డిన్న‌ర్ డేట్స్ కి వెళ్ల‌డం, కలిసి వెకేషన్స్ కు చెక్కేయ‌డం వంటి అంశాలు.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే వార్తలకు బ‌లాన్ని చేకూర్చింది. కానీ రష్మిక, విజయ్ మాత్రం అలాంటిది ఏమీ లేదంటూ తప్పించుకుంటున్నారు.

అయితే ఇప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ తో లవ్‌లో ఉన్నట్టు ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసేసింది. తాజాగా రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లో `ట్రావెలింగ్ రోజులను మిస్ అవుతున్నాను` అంటూ రెండు ఫోటోల‌ను పంచుకుంది. గతంలో టర్కీలో వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్న‌ ఫోటోలివి. ఇందులోని ఒక పిక్ లో సైడ్ కు కూర్చుని ర‌ష్మిక న‌వ్వుతూ క‌నిపించింది. ట్విస్ట్ ఏంటంటే.. కొద్ది రోజుల క్రితమే సేమ్ ప్లేస్ లో దిగిన ఫోటోను విజ‌య్ కూడా పంచుకున్నాడు. ర‌ష్మిక లేటెస్ట్ పోస్ట్ తో అంద‌రికీ ఓ క్లారిటీ వచ్చింది. విజ‌య్‌, ర‌ష్మిక క‌లిసే ట‌ర్కీ వెళ్లార‌ని.. ఎదురుబ‌దురు కూర్చుని ఫోటోలు తీసుకున్నార‌ని తేలిపోయింది.