” అఖండ “కు థమన్ మ్యూజిక్ ప్రాణం పోయేలేదట‌.. సౌండ్ లేకుండా చూసిన అలాగే ఉంటుందా..?!

బాలయ్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా దానికి సంబంధం లేకుండా ప్రేక్షకులు నోటి నుంచి వచ్చే మాట… జై బాలయ్య. ఈ పేరుకు ఎంత పవర్ ఉందో మనందరికీ తెలిసిందే. గత ఏడాది ” వీర సింహారెడ్డి ” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ ని దక్కించుకున్నాడు.

ప్రస్తుతం బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ” భగవంత్ కేసరి ” సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలయ్య మరో సినిమా “అఖండ 2 ” చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని.. సక్సెస్ లో సగం క్రెడిట్స్ ఆయనకే దక్కుతుందని ప్రశంసలు కురిపించారు విమర్శకులు. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి.. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఈ సినిమాకి థమన్ ప్రాణం పోయ్యలేదని సమాధానం ఇచ్చాడు. సౌండ్ లేకుండా చేసిన సేమ్ ఫీల్ ఉంటుందని.. దీనికి థమన్ కొత్తగా చేసిందేమీ లేదని చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన ప్రేక్షకులు.. ఇది దారుణమని.. కనీస కృతజ్ఞత లేకుండా అలా ఎలా మాట్లాడతారని అంటున్నారు. గతంలో బాలయ్య నటించిన ” లెజెండ్ ” మూవీకి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ ను కూడా బోయపాటి ఇలాగే అవమానించాడని తిట్టిపోశారు. ప్రస్తుతం బోయపాటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.