ఇండస్ట్రీకి రాకముందు హీరో శివాజీ ఏం చేసేవారో తెలుసా.?

సాధారణంగా చాలామంది ఇండస్ట్రీలోకి రావాలన్న కోరికతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది రోజులకే ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. మరికొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యి ఆ తర్వాత రాజకీయాలలోకి కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి వారిలో హీరో శివాజీ కూడా ఒకరు. బిగ్ బాస్ లో సూపర్ కంటెస్టెంట్ గా దూసుకుపోతూ ప్రేక్షకుల అభిమానాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత తనలో ఉన్న కొత్త కోణాన్ని చూపిస్తూ.. టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలవబోతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే హీరోగా 90 సినిమాలకు పైగా చేసిన ఈయన బిగ్ బాస్ కి వెళ్లడమే ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఆయన కెరియర్ లో ఇలాంటి సర్ప్రైజులు చాలానే ఉన్నాయి అని చెబుతున్నారు ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్. హుషారు, అల్లూరి, పాగల్, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు నిర్మాతగా చేసిన బెక్కం వేణుగోపాల్ శివాజీ వల్లే నిర్మాత అయ్యారని సమాచారం.

ఇక ఈయన ఇండస్ట్రీలోకి శివాజీ రాకముందు ఏం చేశారు అన్న విషయాన్ని రివీల్ చేశారు. శివాజీ హీరోగా ప్రయత్నాలు చేసే క్రమంలో ఎడిటర్ గా కెరియర్ మొదలుపెట్టారట. అలా సీసీ చానల్స్ లో ఎడిటర్ గా ఉన్న శివాజీని జెమినీ టీవీలో యాంకర్ గా చేసింది మాత్రం బెక్కం వేణుగోపాల్.. ఇక తర్వాత తాను యాంకర్ నుంచి హీరోగా మారిన తర్వాత బెక్కం వేణుగోపాలని తన మేనేజర్ గా పెట్టుకున్నాడు శివాజీ అంతేకాదు వీరిద్దరూ కలిసి లక్కీ మీడియా ఫ్యాక్టరీని స్థాపించి అనేక సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో సత్తా చాటుకున్నారు శివాజీ.