అత్యంత భారీ ధరకి ” గుంటూరు కారం ” మూవీ ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీలో మహేష్ బాబు చాలా రోజుల తరువాత మంచి మాస్ పాత్ర చేస్తుండగా.. ఆయనకు జోడిగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు, జయరాం, సునీల్, ఆలీ, హైపర్ ఆది తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు. అయితే రిలీజ్ కి ముందే ఇప్పటికే డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ విషయంలో పెద్ద రికార్డు ధరకు అమ్ముడు బోయిన ఈ మూవీ యొక్క ఏపీ, తెలంగాణా థియేట్రికల్ రైట్ రూ. 120 కోట్లకు అలానే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్ రూ. 155 కోట్లకు క్లోజ్ కానున్నాయట.

మొత్తంగా ఇది రీజినల్ సినిమాల్లో భారీ రికార్డు అని అంటున్నారు ట్రెడ్ విశ్లేషకులు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ భారీ స్థాయిలో నిర్మిస్తున్న గుంటూరు కారం మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది.