MAD సినిమాతో అన్ని కోట్లు లాభం పొందిన త్రివిక్రమ్ భార్య..!!

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి..అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచి భారీ అంచనాలను ఏర్పరచుకొని మంచి సక్సెస్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన మ్యాడ్ సినిమా కూడా ఒకటి.. కాలేజీ బ్యాగ్రౌండ్ లో ఫన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి కలెక్షన్లు ఇప్పటికీ భారీగానే వస్తున్నాయి.

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన ఈ కామెడీ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో హారిక సాయి సౌజన్య నిర్మించడం జరిగింది. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘు బాబు, మురళీధర్ గౌడ్, రచ్చ రవి సైతం తదితరులు ఇందులో నటించడం జరిగింది. క్రేజీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం మంచి హైప్ ఏర్పడింది. దీనికి తోడు ప్రచార కార్యక్రమాలతో కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి

ఈ సినిమా అన్ని ఏరియాలో కలుపుకొని రెండు కోట్ల మేరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.. ఇక తొమ్మిది రోజులకు గాను ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలను రాబట్టింది అంటే.. ఈ చిత్రం నైజాం, సీడెడ్ ,ఆంధ్రలో కలుపుకొని మొత్తం మీద 7 కోట్ల రూపాయల వరకు షేర్ ను రాబట్టింది.. అలాగే 13.50 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూలు రాబట్టినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిందట..ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా 6.57 కోట్ల రూపాయల లాభాన్ని త్రివిక్రమ్ భార్యకు ఈ సినిమా తెచ్చిపెట్టింది.