నా అన్వేషణ ట్రావెలర్ అన్వేష్ ను ఇమిటేట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. మంచి ఆటగాళ్లు అంటూ..

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నవీన్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో కామెడీ టైమింగ్ తో అదరగొట్టే నవీన్ ఇటీవల మిస్‌శెట్టి మిస్టర్ పోలీశెట్టి సినిమాతో అనుష్కకు జతకట్టాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా నవీన్ పోలిశెట్టి అందరితో అలాగే సందడి చేస్తు నవ్విస్తూ ఉంటాడని సన్నిహితులు చెప్తూన్నారు. సినిమానే కాదు ఏ ఇవెంట్లో అయినా నవీన్ ఉంటే ఆ జోషే వేరు. ఇక సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ కూడా ఎప్పటికప్పుడు వినూత్నంగా చేస్తూ అందరిని ఆకట్టుకుంటాడు.

తాజాగా మరోసారి నవీన్ తన వే ఆఫ్ ప్రమోషన్ చేసి అందరినీ ఆపట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచం అంత సోషల్ మీడియాలో నడుస్తుంది. యూట్యూబ్.. ఫుడ్ బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగర్స్ ప్రపంచం మొత్తం తిరిగి ఆ వీడియోలను అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు.. సంపాదించుకుంటున్నారు. ఇక అందులో నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అన్వేష్ కూడా ఒకడు. లక్షలాది ఫాలోవర్స్ ఉన్న అన్వేష్ మొత్తం రౌండ్లు కొడుతూ మారుమూల దేశాలు వీడియోలు తీసి అక్కడ పద్ధతులు.. ఆహార అలవాట్లను బంధించి నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ లో రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాడు.

అతనికి ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఉత్తరాంధ్ర యాసలో అన్వేష్ మాట్లాడుతూ కామెడీ చేస్తూ ఉంటాడు. తాజాగా నవీన్ అన్వేష్‌ను ఇమిటేట్ చేస్తూ డిటో అన్వేష్ వాయిస్‌తో ప్రమోషన్ చేసుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ ఏంజెల్స్ వచ్చాము. ఆటగాళ్లు అందరూ చూస్తున్నారా. ఆటగాళ్లకు చెప్పేది ఏంటంటే మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చూసేయండి అంటూ తన సినిమా ప్రమోషన్‌స్‌ ఫన్నీ వేలో చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.