పవన్ కళ్యాణ్- జూనియర్ ఎన్టీఆర్ మధ్య తేడా ఇదే..!!

చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కావడంతో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో పలు రకాల వార్తలో ఎన్టీఆర్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు పలువురు నాయకులు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లగొట్టింది చంద్రబాబునాయుడే అంటూ సీనియర్ నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ తెలియజేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి ఎంతైనా సొంత ఫ్యామిలీ కదా అంటున్నారు అసలు ఎన్టీఆర్ ని తమ కుటుంబ సభ్యుడని ఎప్పుడు చూశారు అంటూ తాజాగా తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఎన్టీఆర్ కు సంబంధం లేదని ఎన్టీఆర్ స్పందించాలని అడిగే వాళ్లకు ఏం సంబంధం.. కుటుంబం కదా అని ఎన్టీఆర్ అనుకోవడం కాదు అసలు ఆయనని ఎప్పుడైనా వీళ్లు కుటుంబ సభ్యులు చూశారా అంటూ తెలిపారు.. తనకు తెలిసినంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ని తమ కుటుంబముని నందమూరి కానీ నారా ఫ్యామిలీ కానీ ఎప్పుడూ అనుకోలేదు..మధ్యలో కొంతకాలం అనుకున్నారు ఎన్టీఆర్ ఎప్పుడు సపరేటుగానే ఉండేవారని తెలిపారు. ఎన్టీఆర్ కి స్టార్డం వచ్చిన తర్వాతే వీళ్లంతా వచ్చారు నందమూరి తారక రామారావు అని పేరు ఉంది కాబట్టే దగ్గరికి పిల్చుకున్నారు అని తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు పిలిచి ఎన్నికల ప్రచారం చేయమంటేనే వెళ్లారు.. మధ్యలో ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది ఆ ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయటపడ్డారు. అలాంటి మనిషిని 2014లో వదిలేసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు.. తాను ఇంట్లో కలవను ఆఫీసులో కలుస్తానని పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు మళ్ళీ ఆఫీసుకు వెళ్లి రెండు గంటలు వెయిట్ చేసి మరి పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారు.. పవన్ కళ్యాణ్ కి జూనియర్ ఎన్టీఆర్ కి తేడా అదే ఇద్దరు ఒకటే లేవల్ కానీ సొంత మనిషిని వదిలేసి పరాయి వాళ్ల దగ్గరికి వెళ్లి అడుక్కోవడం అంటే ఇదే అంటూ తెలిపారు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ఎలాంటి విషయాలపైన స్పందించలేదని తెలియజేశారు.