మహేష్ బాబు ” గుంటూరు కారం ” సినిమాలో అనసూయ.. సూపర్ ట్విస్ట్..!!

రంగస్థలంలో రామ్ చరణ్, పుష్పలో అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతో నటించి ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది హాట్ యాంకర్ అనసూయ. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీ పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉంది. ఇక అనసూయ సోషల్ మీడియాలోని అందాల ఆరబోత గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

నిత్యం మతి పోగొట్టే హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంటుంది. హిట్-ఫట్ అనే విషయం పక్కన పెడితే గట్టిగా మాత్రం తనను తాను నిరూపించుకుంటుంది. ఇందులో భాగంగా ఇటీట‌వ‌ల‌ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ” గుంటూరు కారం ” సినిమాలో ఓ రోల్ పోషించబోతుంది.

అది కూడా ఆంటీ పాత్రలో అని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ క్యారెక్టర్ మూవీలో చాలా ఫన్నీ ఫన్నీ గా ఉంటుందని తెలుస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన రాక‌పోయినా ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.