సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన రాజ‌శేఖ‌ర్‌.. ఆ టాలీవుడ్ హీరో మూవీలో యాంగ్రీ యంగ్ మెన్!

టాలీవుడ్ లో బాల‌కృష్ణ‌, చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోలు ఇప్ప‌టికీ హీరోలుగానే సినిమాలు చేస్తూ కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. అయితే వారితో పాటే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకుని ఓ వెలుగు వెలిగిన యాంగ్రీ యంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ మాత్రం క్ర‌మంగా ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆయ‌న సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. టాలీవుడ్ హీరో నితిన్ `ఎక్స్ ట్రా` సినిమాతో రాజ‌శేఖ‌ర్ స‌హాయ‌క న‌టుడిగా మార‌బోతున్నాడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టిస్తోంది. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో సీనియ‌ర్ స్టార్ హీరో రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. రెండు రోజుల క్రిత‌మే ఆయ‌న ఎక్స్ ట్రా మూవీ షూటింగ్ కూడా జాయిన్ అయ్యాడు. మూవీతో ఆయ‌న రోల్ చాలా కీల‌కంగా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి సెకండ్ ఇన్నింగ్స్ లో రాజ‌శేక‌ర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. కాగా, ఎక్స్ ట్రా మూవీని డిసెంబర్ 23న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ, అదే స‌మ‌యానికి ప్ర‌భాస్ `స‌లార్ పార్ట్ 1`తో రాబోతున్నాడు. దీంతో ఎక్స్ ట్రా తో స‌హా క్రిస్మ‌స్ కు రావాల‌నుకున్న ప‌లు సినిమాలు వెన‌క్కి త‌గ్గుతున్నాయి.