పెళ్లికి ముందే ఆడపడుచు పై పెత్తనం చెలాయిస్తోన్న లావణ్య.. ఏమైందంటే.?

ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో మెగా కోడలు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా వివాహం కూడా జరగలేదు అప్పుడే ఇంటి ఆడపడుచు నిహారిక పై ఆమె పెత్తనం చెలాయిస్తోంది అంటూ ఒక వార్త ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. అయితే నిహారిక ఏం చేసింది ?లావణ్య పెత్తనం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా నవంబర్ 1వ తేదీన ఇటలీలో పెళ్లి పీటలెక్కపోతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. అందులో భాగంగానే చిరంజీవి , ఉపాసన, లావణ్య త్రిపాఠి , వరుణ్ తేజ్ అందరూ కూడా పెళ్లి డెకరేషన్ కి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే పెళ్లికి కొద్ది రోజులు సమయం ఉంది అనగా లావణ్య త్రిపాఠి ఇలా తన ఆడపడుచు నిహారికపై పెత్తనం చెలాయిస్తూ కోప్పడడం సోషల్ మీడియాలో పలు వార్తలకు దారితీస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే ఎప్పుడైతే నిహారిక తన భర్త నుంచి విడాకులు తీసుకుందో అప్పటినుంచి సోషల్ మీడియాలో ఆమె ఆక్టివ్ గా ఉంటూ పలు వెబ్ సిరీస్ లకి, కొన్ని సినిమాలకి కూడా ఒకే చెబుతూ సోషల్ మీడియాలో చిట్టి పొట్టి బట్టలు వేస్తూ నానా రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఎక్స్పోజ్ చేస్తోంది నిహారిక. అయితే ఇవన్నీ చూసిన లావణ్య నిహారికను ఇంటికి పిలిచి మరి క్లాస్ ఇచ్చిందట.

ఇన్ని రోజులు బాగానే ఉన్నావు మధ్యలో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు మొదటి నుండి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉండి ఎక్స్పోజ్ చేస్తే ఎవరు అంతగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు అలాంటి ఎక్స్పోజింగ్ చేస్తే మాత్రం మెగా ఫ్యామిలీ పై మీ నాన్న ,అన్నయ్య లపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే వాటిని నువ్వు చూసే ఉంటావు అంటూ హెచ్చరించిందట. కానీ నిహారిక మాత్రం వాటిని పట్టించుకుంటే జీవితంలో ముందుకు వెళ్లలేము అని చెప్పిందట. దీనికి సీరియస్ అయినా లావణ్య ఇకపై పొట్టి బట్టలు వేసుకుంటే బాగుండదు అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.