చై టాటూ తొలగించుకున్న సమంత.. ఇలాంటి పని జన్మలో చేయొద్దు అంటూ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నాగచైతన్య నుంచి విడాకుల ద్వారా విడిపోయిన సంగతి తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమా నుంచి మజిలీ వరకు వీరిద్దరూ వెండితెరపై మంచి కెమిస్ట్రీ పండించి ఆకట్టుకున్నారు. వారిద్దరూ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలామందిని ఫిదా చేసింది. వీరు అన్యోన్యంగా మ్యారేజ్ లైఫ్ గడుపుతున్నారని అభిమానులు కూడా అప్పట్లో ఖుషి అయ్యారు. కానీ వారు సడన్ గా విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు.

మళ్లీ వారు కలవాలని ఇప్పటికీ ప్రార్థనలు చేసే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వారిద్దరూ కలుస్తారేమోననే ఉద్దేశంతో రోజూ వారి ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవుతున్న వారు కూడా ఎక్కువమంది ఉన్నారు. ఇటీవల యాష్ అనే ఫ్రెంచ్ బుల్ డాగ్‌ను సామ్, చై కోపేరేంటింగ్ చేస్తున్నారని అభిమానులు కనుక్కున్నారు. విడిపోయినా డాగ్ విషయంలో ఇద్దరు సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నారని రుజువులతో సహా చూపించారు. అలాగే వారు విడిపోయినా మాట్లాడుకుంటున్నారా అని ఊహాగానాలు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సమంత షేర్ చేసిన కొన్ని ఫోటోలు వారి ఆశను నీరుగారుస్తున్నాయి.

సమంత గతంలో నాగచైతన్య పై ప్రేమతో తన బ్రెస్ట్ కింద కుడి పక్కన శరీరంపై “చై ” అని ఒక టాటూ పొడిపించుకుంది. అయితే ఇటీవల ఆ శరీర భాగాన్ని ఎక్స్‌ పోజ్ చేసే కొన్ని ఫోటోలు ఈ ముద్దుగుమ్మ షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ శరీరంపై చై అనే టాటూ మిస్ అయి కనిపించింది. అతడిని తన జీవితం నుంచి శాశ్వతంగా తీసేయాలని ఉద్దేశంతో సమంత టాటూ రిమూవ్ చేయించుకుందా అని చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. లేదంటే ఆ టాటూ కనిపించకుండా కావాలనే మేకప్ వేసి దానిని కవర్ చేసిందా అని మరికొందరు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఫోటోలు పెద్ద చర్చకే దారి తీసాయి. గతంలో సమంత టాటూ ఎవరూ వేయించుకోవద్దని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను వేయించుకునే పెద్ద తప్పు చేశానని, జన్మలో మళ్ళీ ఇలాంటి పని చేయను అని కూడా చెప్పింది.