దిల్ రాజుతో మరో కొత్త సినిమాకు సిద్ధమైన రౌడీ హీరో.. డైరెక్టర్ అతడే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై VD 13 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ లో ఒక పేరు ఉన్న డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవలే ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఇప్పుడు VD 13 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇంకా ఈ ప్రాజెక్టు షూటింగ్ దశలోనే ఉండగానే అశోకవనంలో అర్చన కళ్యాణం సినిమా డైరెక్టర్ విద్యాసాగర్ చింతాతో కలిసి మరో ప్రాజెక్టులో నటించడానికి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా ఈ సినిమాని కూడా దిల్ రాజునే నిర్మించబోతున్నారని సమాచారం. అంతేకాదు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంటును కూడా ఇవ్వబోతున్నారు. ఇక డైరెక్టర్ విద్యాసాగర్ విషయానికి వస్తే.. 2017లో వెళ్ళిపోమాకే ఆ తర్వాత 2019లో ఫలక్ నామాదాస్, 2021లో అద్భుతం వంటి చిత్రాలకు సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేసి.. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

 

గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. మరొకవైపు విజయ్ దేవరకొండ దర్శకుడు పరుసురాం దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.