దుమ్ము లేపేస్తున్న భగవంత్ కేసరి ట్రైలర్..!!

నందమూరి బాలకృష్ణ ,డైరెక్టర్ అనిల్ రావు పూడి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి.. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటించిన కాజల్ అగర్వాల్ బాలయ్య కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చివరిగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి మాస్ కామెడీ ఎంటర్టైర్మెంట్ చిత్రంగా దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర బృందం కొన్ని గంటల క్రితం విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కాత్యాయిని అనే పాత్రలో టీచరుగా కనిపించబోతోంది.భగవంత్ కేసరి.. ట్రైలర్ విషయానికి వస్తే తెలంగాణ యాసలో బాలయ్య దుమ్ము లేపేస్తున్నారని చెప్పవచ్చు. అలాగే అనిల్ రావుపూడి కామెడీ మార్క్ ఈ సినిమాలో మరొకసారి కనిపించబోతోంది.

ముఖ్యంగా శ్రీ లీల బాలయ్య మధ్య వచ్చే సన్నివేశాలు సైతం ఎమోషనల్ గా అందరినీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. బాలయ్య ఇందులో తన కూతురికి ఆర్మీ ట్రైనింగ్ కోసం సిద్ధం చేస్తున్నట్లుగా చూపించడం జరిగింది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉండే విధంగా కనిపిస్తోంది. ఇందులో బాలయ్య డైలాగ్ లు డైలాగులు హైలైట్ గా నిలుస్తున్నాయి. కాజల్ కూడా ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇస్తోంది. ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఏ విధంగా ఉంటుందో తెలియాలి అంటే అక్టోబర్ 19 వరకు ఆగాల్సిందే.. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.