నా కల నెరవేరింది అంటూ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలలో కల్కి సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడు చూడని పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. అంతేకాకుండా ప్రభాస్ కెరియర్ లోనే ఎప్పుడు టచ్ చేయని ఒక జోనర్ కి సైతం ఈ సినిమాలో ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ ఈ సినిమా పైన భారీ హైపుని క్రియేట్ చేయడం జరిగింది.

First look of Prabhas' next film with Maruthi to be unveiled on his  birthday | Telugu Movie News - Times of India

ఇందులో అమితాబచ్చన్, దీపికా పదుకొనే ,దిశాపటాని కమలహాసన్ వంటి వారు నటిస్తూ ఉన్నారు. ఇప్పటికె కొంతమందికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను సైతం విడుదల చేశారు..నిన్నటి రోజున అమితాబచ్చన్ బర్తడే సందర్భంగా కూడా అదిరిపోయే పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ను షేర్ చేస్తూ తన కల నెరవేరింది అంటూ ప్రభాస్ రాసుకొచ్చారు. కల్కి చిత్ర యూనిట్ సైతం బర్తడే విషెస్ తెలుపుతూ ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇందులో అమితాబ్ లుక్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గుహలో సూర్యకిరణాలు వెలుగుల మధ్య ఒళ్లంతా ముఖాన్ని గుద్దతో కప్పుకొని చేతిలో కర్ర చెయ్యొద్దు మనిషిలా నిలబడి ఉన్నారు.. ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది .ఈ పోస్టర్ని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ బిగ్ బి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ప్రభాస్.. అలాగే కొన్ని తరాలకు స్ఫూర్తినిచ్చి ఒక లెజెండ్తో కలిసి పని చేయడం నాకు దక్కిన వరం నిజంగా కళ నెరవేయడం అంటే ఇదేనేమో అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ అంటూ తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి కి రిలీజ్ చేయబోతున్నారు. దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)