ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. దాదాపుగా 70 కోట్ల రూపాయల వరకు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్కు కారు లంటే విపరీతమైన ప్రేమ అలాగే కరీదైన లగ్జరీ వాచెస్ కూడా ఉన్నాయి.. నిత్యం ఎన్టీఆర్ లైఫ్ స్టైల్ కు సంబంధించి ఎక్కడో ఒకచోట ఇంట్రెస్టింగ్ వార్తలనేవి వినిపిస్తూ ఉంటాయి. గతంలో కూడా ఎన్టీఆర్ ధరించిన వాచ్ గురించి కూడా పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉండేవి.. ప్రస్తుతం తాజాగా NTR కొత్త వాచ్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ధర సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.MAD సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇవ్వ హీరో సంగీత్ శోభన్ తారక్ ను కలవడం జరిగింది. వీరిద్దరి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

అయితే ఇందులో ఎన్టీఆర్ ధరించిన వాచ్ పైనే అందరి దృష్టి పడింది. అయితే ఈ బ్రాండెడ్ వాచ్ MB &F చెందినదట.. ఈ వాచ్ విలువ దాదాపుగా 1.66 కోట్ల రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ విషయం విన్న అభిమానులు పలువురు నెట్టిజన్స్ సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. దేవర సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తన తదుపరిచిత్రాన్ని చేయబోతున్నట్లు ఇటీవల అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది.