బాలయ్య కోడలిగా శ్రీ లీల.. క్లారిటీ ఇచ్చేసిన టీమ్..!

నిరంతరం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హీరోయిన్ల పెళ్లి వ్యవహారాలు చాలా వైరల్ గా మారుతున్నాయి.. వీరి మీద పలు రకాల గాసిప్స్ కూడా రోజురోజుకి శృతి మించి పోతున్నాయని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల క్రితం హీరోయిన్ కీర్తిసురేష్ వెళ్లిపై పలు రకాల రూమర్స్ వినిపించాయి. మరొక హీరోయిన్ సాయి పల్లవి పైన కూడా డైరెక్టర్ని వివాహం చేసుకొందనే వార్తలు కూడా వినిపించాయి. ఇలాంటి వాటి పైన డైరెక్ట్ గా వీరే స్పందించాల్సి రావడం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరుపొందిన శ్రీ లీల పైన కూడా ఇలాంటి గాసిఫ్ ఒకటి వినిపిస్తోంది.

ప్రస్తుతం ఈమె నందమూరి బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి అనే సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో నటించింది. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కాబోతోంది. ఈ మధ్యనే ట్రైలర్ ను కూడా విడుదల చేస్తూ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా చేయడం జరిగింది.. ఈ ఈవెంట్ లో శ్రీలీలతో తాను హీరోగా నటిస్తానంటే బాలయ్య కుమారుడు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని అడిగాడని బాలయ్య కామెంట్ చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. మరొక పక్క బాలయ్య శ్రీలీల ,మోక్షజ్ఞ కలిసి ఉన్న ఫోటోలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

దీంతో బాలయ్య కోడలు శ్రీ లీల కాబోతోందంటూ పలు రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. వాస్తవానికి మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు బాలయ్య.. ఒకవైపు సినిమాల పైన దృష్టి పెడుతూ ఉంటాగా అలాంటి సమయంలో భగవంత్ కేసరి దీంతో కలిసి ఫోటోలలో కనిపించారు మోక్షజ్ఞ. ఈ మాత్రానికి శ్రీలీలను అతని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు రావడం పై శ్రీలీలా టీం కొట్టి పారేసింది. ఇవన్నీ రూమర్స్ అంటూ తెలిపారు.. ఎట్టకేలకు ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడంతో శ్రీలీల అభిమానులు కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.