హీరోయిన్ విద్యాబాలన్ కు ఇంత పెద్ద కూతురు ఉందా..!!

సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు కూడా అప్పుడప్పుడు అభిమానులు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వివాహం పిల్లలు వగైరా వగైరా వంటి వాటిని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది.. ముఖ్యంగా పిల్లలతో కలిసి ఎవరైనా సెలబ్రిటీలు బయటికి వచ్చారు అంటే తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి..బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఎయిర్ పోర్టులో విద్యాబాలన్ దగ్గర ఒక పాపను చూసి విద్యాబాలన్ కూతురు అంటూ పలువురు రాసుకురావడం జరిగిందట.

డర్టీ పిక్చర్ సినిమాతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన ఈ అమ్మడు తెలుగులో బాలయ్య నటించిన కథానాయకుడు వంటి సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. బాలీవుడ్ లో మాత్రం ఒకప్పుడు ఒక ఊపు ఊపేసింది విద్యాబాలన్.. ఇప్పటికే పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఈమె 2012లో నిర్మాత సిద్ధార్థ రాయ్ కపూర్ ను వివాహం చేసుకుంది. అయితే వీరికి ఇప్పటివరకు సంతానం లేదట. అయితే నిన్నటి రోజున ఈ భామ ఎయిర్ పోర్టులో ఒక పదేళ్ల చిన్నారితో కనిపించడం జరిగిందట. దీంతో అభిమానులు సైతం విద్యాబాలన్ కి ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ పలు వార్తలు వినిపించాయి.

అయితే ఎంతో ప్రేమగా మాట్లాడుతూ చిన్నారుని దగ్గరికి తీసుకుంటూ కనిపించడంతో ఈమె విద్యాబాలన్ కూతురు అంటూ బాలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపించాయి.. అయితే ఈ వార్తల పైన విద్యాబాలన్ స్పందిస్తూ ఆ అమ్మాయి పేరు ఐరా ఆమె నా సొంత కూతురు కాదు.. నా అక్క కూతురు.. వారు కవలలు అందులో ఈమె ఒకరు ఐరా అంటూ తెలియజేసింది. దీంతో తన పిల్లలంటూ వస్తున్న వార్తలకు విద్యాబాలన్ చెక్ పెట్టడం జరిగింది.