హీరో అమీర్ ఖాన్ ఇంట పెళ్లి బజాలు..!!

బాలీవుడ్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు పొందారు నటుడు అమీర్ ఖాన్.. త్వరలోనే అమీర్ ఖాన్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.. తాజాగా తన కూతురు పెళ్లికి సంబంధించి డేటును సైతం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అమీర్ ఖాన్.. అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దంపతులకు జన్మించిన ఐరా ఒక ఫిట్నెస్ ట్రైనర్ తో గత కొద్ది రోజుల నుంచి ఈమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా గత ఏడాది నవంబర్ 18న వీరి నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది.

చాలా కాలం నుంచి నుపూర్ శిఖర్ తో ప్రేమలో ఉండడంతో ఇరువురు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో వీరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహ సమయం వచ్చే ఏడాది జనవరి 3 వ తేదీన జరగబోతున్నట్లు తాజాగా అమీర్ ఖాన్ ప్రకటించడం జరిగింది. తాజాగా ప్రముఖ న్యూస్ పోర్టల్ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈయన ఈ మేరకు అధికారికంగా స్పందించడం జరిగింది. ఐరా జనవరి మూడవ తేదీన వివాహం చేసుకోబోతోందని అతడి పేరు నుపూర్ అతడు ఒక లవ్లీ బాయ్ అని తెలియజేశారు.

తన కూతురు మానసికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమెకు అండగా నిలిచి తోడుగా నిలవడంతో వారిద్దరు కలిసి సంతోషంగా ఉన్నందువలన తనకి కూడా సంతోషంగా అనిపించిందని వారి ఒకరి గురించి మరొకరు బాగా అర్థం చేసుకున్నారని అమీర్ ఖాన్ తెలియజేశారు.. నుపూర్ తనకు కుమారుడితో సమానం అంటూ కూడా తెలియజేశారు. అమీర్ ఖాన్ కూతురు పెళ్లికి భారీ ఎత్తున ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు..