రవితేజ యష్ ఫ్యాన్స్ మధ్య ముదురుతున్న వార్..

ప్రస్తుతం హీరోలంతా పాన్ ఇండియా దశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజు రవితేజ కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాను హిందీలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. రవితేజ నటించిన చాలా సినిమాలు హిందీలో డబ్ అయితే థియేటర్స్ కంటే యూట్యూబ్ లోనే అతని సినిమాలు అక్కడ ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించారు. అందుకే హిందీ థియేటర్లపై మూవీటిం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. ఈ సినిమాకు రవితేజ దాదాపు అన్ని భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పారు.

ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ ఇవెంట్‌ల‌లో హంగామా చేస్తున్నాడు రవితేజ. జాతీయ మీడియాలో కూడా ఈ సినిమా ప్రమోషన్ జరుగుతున్నాయి. ఒక జాతీయ మీడియా సమావేశంలో రవితేజ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. రామ్ చరణ్, విజయ్, రాజమౌళి, ప్రభాస్, య‌ష్‌ల‌ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ రామ్ చరణ్, విజయ్ వీరి డాన్స్ అంటే ఇష్టమని.. ప్రభాస్ నిజంగా డార్లింగ్ అని.. రాజమౌళి అంటే ఓ విజ‌న్ అని ఎష్‌కు కేజీఎఫ్ లాంటి సినిమా దొరకడం అదృష్టం.. కే జి ఎఫ్ తప్ప ఏ సినిమా చూడలేదు అంటూ వారి గురించి కామెంట్స్ చేశాడు.

 

ఈ క్ర‌మంలో య‌ష్ ఫ్యాన్స్ రవితేజ పై ఫైర్ అవుతున్నారు. కేజీఎఫ్ లాంటి సినిమా దొరకడం లక్కీ నా.. నువ్వు అలాంటి చిన్న స్టేజి నుంచి వచ్చావని మర్చిపోయావా.. యష్‌ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నువ్వు కూడా ఒక కన్నడ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించావు.. నీకు ఆ సినిమా దొరకడం లక్కీనే అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. రవితేజ ఎంతో కాజువల్ గా చెప్పిన విషయాన్ని పట్టుకొని ఇంత ల్యాగ్‌ చేయడం అవసరమా.. అంటూ రవితేజ ఫాన్స్ ఎష్ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇలా ఇరువర్గాల మధ్య కామెంట్స్ వార్ హోరాహోరిగా సాగుతుంది.