న‌న్నెవ‌డ్రా ఆపేదంటున్న పూజా హెగ్డే.. బుట్ట‌బొమ్మ టైమ్ మొద‌లైంది రోయ్‌!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది నుంచి వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఎంత‌లా స‌త‌మ‌తం అవుతుందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. రాధేశ్యామ్ మొద‌లు పూజా హెగ్డేకు ఫ్లాప్ మీ ఫ్లాప్ ప‌డుతూనే వ‌చ్చింది. ఒక‌ప్పుడు స‌క్సెస్ కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఉన్న పూజా పాప‌.. ఇప్పుడు ఫెయిల్యూర్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయింది.

ఈ క్ర‌మంలోనే ఆమె గ్రాఫ్ ప‌డిపోతూ వ‌చ్చింది. పైగా గుంటూరు కారం వంటి భారీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఎంపిక అయిన పూజాను ఇటీవ‌ల స‌డెన్ గా త‌ప్పించారు. దీంతో చేతిలో ఒక్క సినిమా కూడా లేక ఆమె విల‌విల్లాడిపోయింది. పూజా హెగ్డే కెరీర్ క్లోజ్ అన్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. కానీ, న‌న్నెవ‌డ్రా ఆపేందంటోంది పూజా హెగ్డే.

తాజాగా ఈ అందాల ఓ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది. లాంగ్ బ్యాక్ త‌ర్వాత పూజాహెగ్డే తిరిగి కెమెరా ముందుకు రాబోతోంది. బాలీవుడ్ లో షాహిద్ క‌పూర్ కు జోడీగా పూజా ఓ సినిమాకు క‌మిట్ అయింది. అదే `దేవా`. మ‌ల‌యాళ డైరెక్ట‌ర్ రోష‌న్ ఆండ్రూస్ తెర‌కెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఈ చిత్రంలో షాహిద్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడు. ఆయ‌న ప్రేయ‌సిగా పూజా అల‌రించ‌నుంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది ద‌స‌రాకు దేవా విడుద‌ల కానుంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూట్ స్టార్ కాబోతోంది. మొత్తానికి బుట్ట‌బొమ్మ టైమ్ మొద‌లైంద‌నే చెప్పుకోవాలి.