త్వరలో విక్టరీ వెంకటేష్ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు..!!

విక్టరీ వెంకటేష్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతోమంది ఫ్యామిలీ అభిమానులను సంపాదించుకున్న వెంకటేష్ సాధారణ ప్రేక్షకులను కూడా పలకరిస్తూ ఉంటారు. గత 36 సంవత్సరాల నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలలో నటించిన వెంకటేష్ మంచి విజయాలను అందుకున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా వెంకటేష్ భార్య గురించి కానీ తన పిల్లల గురించి గానీ చెప్పడం లేదు..కానీ గత రెండు మూడేళ్లుగా తన కుటుంబాన్ని ఇండస్ట్రీకి సైతం తెలియజేస్తూ ఉన్నారు. అలాగే వెంకటేష్ తన కుమారుడిని కూడా ఒకసారి పరిచయం చేయడం జరిగింది.అలా సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక విషయంలో వెంకటేష్ తన ఫ్యామిలీ గురించి తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అంటూ సోషల్ మీడియా ద్వారా వెంకటేష్ భార్య పిల్లలు కూడా అందరికీ తెలిసేలా చేస్తున్నారు అభిమానులు.

అసలు విషయంలోకి వెళ్తే వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం సంవత్సరం క్రితం ప్రేమించిన వ్యక్తితో జరుపుకుంది. ఇప్పుడు వెంకటేష్ రెండవ కుమార్తె హాయ వాహిని కూడా త్వరలోనే పెళ్లి పీటలు లెక్కబోతోంది .వెంకటేష్ రెండవ కుమార్తె వివాహం విజయవాడకు చెందిన ఒక ప్రముఖ డాక్టర్ కొడుకుతో జరగబోతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి నిశ్చితార్థం పనులు కూడా జరుగుతున్నట్లు సమాచారం. దీంతో దగ్గుబాటి కుటుంబంలో త్వరలోనే పెళ్లి భాజలు మోకపోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేష్ ప్రస్తుతం సైంధువ్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు.