బాల‌య్య `భగవంత్ కేసరి`కి ఫ‌స్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ `భ‌గ‌వంత్ కేస‌రి`. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల, అర్జున్ రాంపాల్‌, శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. థ‌మ‌న్ సంగీతం అందించాడు.

ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 19న రిలీజ్ అయిన భ‌గ‌వంత్ కేస‌రి మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్ ద‌క్కించుకుంది. థియేట‌ర్ల వ‌ద్ద విజయదుందుభి మోగిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన అన్ని చోట్లా ఎక్స్‌లెంట్ వ‌సూళ్ల‌ను అందుకుంటోంది. దీంతో చిత్ర‌టీమ్ సెల‌బ్రేష‌న్స్ లో మునిగిపోయారు. రీసెంట్ గా బ్లాక్‍బాస్టర్ దావత్ పేరుతో స‌క్సెస్ మీట్ ను కూడా నిర్వ‌హించారు.

అయితే ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వ‌చ్చిన ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు.. భ‌గ‌వంత్ కేస‌రికి అనిల్ రావిపూడి ఫ‌స్ట్ అనుకున్న టైటిల్ ఏంటో రివీల్ చేశారు. ఈ చిత్రానికి మొట్ట‌మొద‌ట‌ ‘ఐ డోంట్ కేర్’ అని టైటిల్ పెడుతున్న‌ట్లు అనిల్ త‌న‌తో చెప్పాడ‌ని.. కొత్త‌గా ఉంద‌ని తానూ అన్నాన‌ని.. కానీ, ఆ త‌ర్వాత బాల‌కృష్ణ క్యారెక్ట‌ర్ గా త‌గ్గ‌ట్లు టైటిల్ ను భగవంత్ కేసరిగా పెట్టి.. ఐ డోంట్ కేర్ ను ట్యాగ్ లైన్ గా మార్చార‌ని దిల్ రాజు చెప్పుకొచ్చారు. దీంతో ఆయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.