ప్రభాస్ మారుతి మూవీ నుంచి ఫోటోలు లిక్..!!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో సినిమా మొదలయ్యి ఇప్పటికి ఎన్నో రోజులు అవుతోంది .ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు. ప్రభాస్ మాత్రం తను నటిస్తున్న కల్కి, సలార్ వంటి చిత్రాలపైనే ఫోకస్ పెట్టి నటిస్తూ ఉన్నారు. ఇద్దరు బడా డైరెక్టర్స్ కావడం చేత ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఈ సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలకు సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు.

మరొకవైపు సైలెంట్ గా సినిమాని పూర్తిచేసే పనిలో పడ్డారు డైరెక్టర్ మారుతి.. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజా డీలక్స్ సినిమా గత కొద్దిరోజులుగా షూటింగ్ ప్రారంభమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా కొన్నిసార్లు ఈ సినిమా సెట్ నుంచి పలు ఫొటోస్ మాత్రం లీక్ కావడం జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో కామెడీ జోనర్ లో సినిమా రాబోతోందని సమాచారం ఇందులో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో రెండు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ లీక్ అయిన ఫోటోలలో ఒక ఫైట్ లో భాగంగా ప్రభాస్ విలన్సుతో పోరాడుతున్న సన్నివేశాలు ఫోటో అన్నట్లుగా సమాచారం. అయితే ఇందులో ప్రభాస్ లుక్ మాత్రం అందరిని ఆశ్చర్యానికి కలిగించే విధంగా కనిపిస్తోంది.. గతంలో ప్రభాస్ కాస్త లావుగా కనిపించారు కానీ ఇప్పుడు మాత్రం ఈ లీకైన ఫోటోలలో ఏక్ నిరంజన్ సినిమాలోని స్టైల్ ని మైంటైన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. హీరోయిన్ మాళవిక మోహన్ కి సంబంధించి యాక్షన్ సన్నివేశాలు కూడా లీక్ అయ్యాయి. ఇక ఇలాంటి సమయంలో చిత్ర బృందం ఇకమీదట ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.