నేటిజన్ అడిగిన తిక్క ప్రశ్నకు.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన తమన్నా..!!

టాలీవుడ్లో మిల్కీ బ్యూటీగా పేరుపొందిన తమన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించిన తమన్నా హీరోయిన్గా కూడా స్టార్ స్టేటస్ ని అందుకున్నది. బాలీవుడ్ ,కోలీవుడ్, టాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది .ఈ మధ్యకాలంలో తమన్నా వ్యక్తిగత కారణాలవల్ల చాలా వార్తలలో నిలుస్తూనే ఉంది. తమన్నా వెబ్ సిరీస్లలో నటిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తున్న సంగతి తెలిసిందే..

అయితే ఇలా షో చేయడం వల్ల ఇప్పటికే పలు రకాల విమర్శలు కూడా ఎదుర్కొంది. తాజాగా ఒక నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ.. మీకు అవకాశాలు లేకపోవడం వల్ల ఇలా గ్లామర్ షో చేస్తున్నారా అంటూ తమన్నా ను ప్రశ్నించడం జరిగింది.. ఈ ప్రశ్నకు తమన్నా ఒక్కసారిగా నెటిజన్ పైన ఫైర్ కావడం జరిగిందట.. ఈ విషయం పైన స్పందిస్తూ తనకు అవకాశాలు లేవని నీకు ఎవరు చెప్పారు ఇప్పటికీ నేను 18 గంటల పాటు కష్టపడుతున్నానని తెలుసా అంటూ ఫైర్ అయ్యింది.

ఇదివరకు తాను అంతగా కష్టపడిన సందర్భాలు అసలు లేవని తన కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్నానని తెలుపుతోంది తమన్నా.. అయినా కూడా నా హద్దులు ఏంటో అనేది నాకు పూర్తిగా తెలుసు తాను ధరించే దుస్తులు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సినిమాని కమిట్ అయ్యాను అంటే కచ్చితంగా తన పాత్రకు న్యాయం చేయగలుగుతానని తెలిపింది తమన్నా నచ్చకపోతే అసలు ఆ సినిమాని చేయనని తెలిపింది. ఇంకొకసారి ఇలాంటి తెలివితక్కువ ప్రశ్నలు వేయొద్దు అంటూ నేటిజన్ పైన ఫైర్ కావడం జరిగింది తమన్నా.