ఎన్టీఆర్ వార్ టిడిపి.. ఎన్టీఆర్ ఫాన్స్ ఘాట్ రిప్లే..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్యనే గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. అయితే టిడిపి నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో ఆ విషయం పైన జూనియర్ ఎన్టీఆర్ అసలు స్పందించలేదు..దీంతో తరచూ ఈ మధ్యకాలంలో ఈ విషయం పైన ఒక చర్చ జరుగుతూనే ఉంది. నామమాత్రమైన సరే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం పైన స్పందించి ఉంటే బాగుంటుందని పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు సైతం తెలుపుతున్నారు.

మరొకవైపు టిడిపి అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వమంటూ కూడా టిడిపి అభిమానులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో గొడవకు దిగుతున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు టిడిపి అభిమానులకు గట్టి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసి ఒకడు కామెడీ చేశాడని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలిపారు.. 2024లో టిడిపి అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ సినిమాలు ఫ్యాన్సీ షో వేయినివ్వమంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కొంతమంది టిడిపి కార్యకర్తలు సైతం తెలియజేస్తున్నారట. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మీకు నిజంగానే అంత దమ్ముందా అయితే ఎన్టీఆర్ సినిమాలను ఆపి చూడాలంటూ తెలియజేస్తున్నారు.

మరి కొంతమంది మాత్రం అసలు మీరు అధికారంలోకి వస్తేనే కదా అంటూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఈ ట్వీట్లు కొంచెం హద్దులు దాటేలా కనిపిస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారుతుంది.ముఖ్యంగా ఎన్టీఆర్ జోలికి వస్తే టిడిపికి నష్టం అంటూ కూడా తెలుపుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం టిడిపి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఒక వార్ జరుగుతోంది.