బుల్లితెర ప్రభాకర్ సీక్రెట్ ఎఫైర్ పై క్లారిటీ..!!

తెలుగు బుల్లితెర పైన నటుడు ప్రభాకర్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. తెలుగు బుల్లితెరపై మెగాస్టార్ అని పిలుపు కూడా పిలిపించుకుంటున్నారు ఎన్నో ఏళ్లుగా సూపర్ హిట్ సీరియల్స్ లో కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాకర్ ఎక్కువగా ఈటీవీ సీరియల్స్ లోనే నటిస్తూ ఉన్నారు. అందుకే ఈయన పేరు ఈటీవీ ప్రభాకర్ గా మారిపోయింది. ఇక తన జీవితంలో తనకి ఒక అమ్మాయితో ఎఫైర్ ఉందంటూ ఒక టీవీ కార్యక్రమంలో ఆయన రివీల్ చేయడం జరిగింది.

ఈరోజు స్టార్ మా చానల్లో ప్రసారం కాబోతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే కార్యక్రమానికి ప్రభాకర్ దంపతులు రావడం జరిగింది. ప్రభాకర్ దంపతులతో పాటు జాకీ దంపతులు కార్తీక దీపం సీరియల్ నటుడు నిరూపమ్ పరిటాల దంపతులు కమెడియన్ యాదమ్మ రాజు దంపతులు ఈ షో కి అటెండ్ అవ్వడం జరిగింది. తన భార్యను బాధపెట్టిన సందర్భం ఒకటి ఉందని ఈటీవీ ప్రభాకర్ తెలియజేశారు.

తెలిసి తెలియక చాలా బాధపెట్టిన సందర్భం ఒకటి ఉందని వివాహమైన హక్కు కూడా తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని ఆ విషయం తెలిసి తన భార్య చాలా బాధపడిందని అయితే నేను ఎలాగోలాగా సరిచేసుకొని మనస్ఫూర్తిగా సారీ చెప్పానని తెలిపారు.. నేను సారీ చెప్పడం ఒక పెద్ద విషయం ఏమీ కాదు తను క్షమించడం అనేది గొప్ప విషయమని ప్రభాకర్ తెలియజేశారు.. అలా చెబుతూనే తన భార్య బుగ్గ పైన ఆత్మీయంగా ముద్దు పెట్టి షాక్ ఇచ్చారు.ప్రస్తుతం అందుకు సంబంధించి ప్రోమో వీడియో వైరల్ గా మారుతోంది.