ప్రభాస్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణంరాజు భార్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే కచ్చితంగా ప్రభాస్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. పలు రకాల భారీ ప్రాజెక్టులకు బిజీగా ఉన్న ప్రభాస్ పెళ్లి విషయం మాత్రం దాటేస్తూ ఉన్నారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి పైన పలు విషయాలను తెలియజేయడం జరిగింది.

అది పురుష్ సినిమా తరువాత నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ సినిమాలతో అటు అభిమానులను ఆనందపరిచేలా చేస్తున్నారు. పెళ్లి విషయంలో మాత్రం నిరాశకు గురి చేస్తూ ఉన్నారు. గత కొద్దిరోజులుగా అనుష్కతో పెళ్లి అంటూ పలు రకాల రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఈ రూమర్ అన్ని పక్కన పెడితే ప్రభాస్ పెళ్లి ఎవరితో ఎప్పుడు అవుతుందని విషయాన్ని తాజాగా కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి దసరా నవరాత్రులలో విజయవాడ దుర్గమ్మ దర్శించుకునేందుకు అక్కడికి రావడంతో మీడియా ప్రతినిధులు పలు రకాల ప్రశ్నలు వేయడం జరిగింది.

కృష్ణంరాజు గారు తమతో లేకపోయినా ఆయన పేరు నిలబెడుతూ తమ కుటుంబాన్ని ముందుకు తీసుకు వెళుతున్న ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని తన కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని శ్యామలాదేవి తెలిపింది. అమ్మాయి ఎవరు డేట్ ఎప్పుడు తెలియదు కానీ ఆరోజు త్వరలోనే ఉందంటూ తెలియజేసింది. వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఖచ్చితంగా ఒక ఇంటి వాడవుతాడని శ్యామలాదేవి తెలిపింది ప్రస్తుతం ఈమె చెప్పిన విషయం ప్రభాస్ అభిమానులను ఆనందపరిచేయాలా ఉన్నది. మరి ఈ విషయం పై ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాలి.