మళ్లీ అలాంటి సెంటిమెంట్ నే నమ్ముకున్న బాలయ్య.. సక్సెస్ అయినట్టే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్న హీరో బాలయ్య ఈ మధ్యనే అఖండ, వీరసింహారెడ్డి సినిమాల్లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నాడు. ఈ మధ్యనే భగవత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ విషయాలు కాస్త పక్కన పెడితే ఇండస్ట్రీలో ఏ పనిని మొదలుపెట్టిన ముహూర్తాలు సెంటిమెంట్లు సహజం.. ముహూర్తం చూసుకొని ఏ శుభకార్యాన్నైనా మొదలుపెట్టరు. అందులో బాలయ్య కూడా ఒకరు.

ఇలాంటి సెంటిమెంట్లు ఇండస్ట్రీలో మిగతా వారితో పోలిస్తే బాలయ్యకి ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి.త‌ను న‌మ్మే సెంటిమెంట్ ప్ర‌కార‌మే ఆయ‌న సినిమాలు చేస్తుంటారు. కొన్ని ర‌కాల రింగ్‌లు ధ‌రిస్తే ఈ ప‌ని జ‌రుగుతుంద‌ని, లేక‌పోతే జరగదని బాలయ్య నమ్మకం దానికి నిదర్శనం బాలయ్య ఆ రింగును ధరించి అఖండ సినిమా తీశాడు ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ను సాధించిందో చెప్పనవసరం లేదు. కలెక్షన్ల విషయానికొస్తే ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి.
అంతటి పవర్ ఉన్న మెగా రింగును ధరించినందుకు ఇంత ఫలితం లభించిందని పలువురు నెటిజెన్స్ తెలుపుతున్నారు.

 

ఇక ఆ తరువాత వీరసింహారెడ్డి సినిమాకి కూడా ఇదే రింగుని ధరిస్తాడేమో అనుకున్నారు ఫ్యాన్స్ కానీ ఆ రింగుని పక్కన పెట్టడంతో ఆ సినిమా ఏదో అలా ఆడింది. ఈసారి భగవత్ కేసరి సినిమాకి అలా జరగకూడదు అని ఆ రింగు ని షూటింగ్ టైంలో కూడా పెట్టుకున్నారు. అయితే ఆయన సెంటిమెంట్ రింగ్ పెట్టుకున్నాడు కాబట్టి ఆ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.భగవత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే ఆ రింగుకి చాలా ప్రత్యేకత ఉన్నట్లే అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్..